ఉద్యోగాలను వెతికే సైట్​లో ఉద్యోగుల తొలగింపు

ఉద్యోగాలను వెతికే సైట్​లో ఉద్యోగుల తొలగింపు

లింక్డ్​ ఇన్​ ఈ పేరు వింటే టక్కున గుర్తొచ్చేది ఏంటి.. నేర్చుకున్న నైపుణ్యాలతో మనకు సెట్​అయ్యే జాబ్​లను క్షణాల్లో చూపిస్తుంది. అందుకే ఈ సైట్ బాగా పాపులర్​ అయింది. అలాంటి సైట్​ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే పనిలో ఉంది. అందులో భాగంగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

716 మంది ఉద్యోగులు...

డిమాండ్​ తగ్గుదల కారణంగా 716 మంది ఉద్యోగులను తీసేయనున్నట్లు లింక్డ్​ఇన్​ యాజమాన్యం ప్రకటించింది. ఫిబ్రవరిలోనూ ఉద్యోగులను తొలగించింది. ఆ నిర్ణయం అప్పుడు రిక్రూటింగ్​ బృందాన్ని ప్రభావితం చేసింది. మైక్రోసాఫ్ట్​ యాజమాన్యంలోని జాబ్స్​ ప్లాట్​ఫాంలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రెండు త్రైమాసికాలుగా ఆదాయం పెరిగినప్పటికీ ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించడం గమనార్హం.  కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈవో ర్యాన్​ రోస్లాన్క్సీ తెలిపారు. కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.