వాహనాలు జాగ్రత్తగా నడపాలని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా చెబుతున్నా.. కొందరి వైఖరి మారట్లేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. అమాయకుల ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో వలస కూలి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఓఆర్ఆర్ వద్ద ఓ వ్యక్తి తోటి కూలీలతో కలిసి పెయింట్ వేస్తున్నాడు.
ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఓ కారు అతన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ధాటికి అతను ఓఆర్ఆర్ పై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.