
దేశంలో సడెన్ హార్ట్ అటాక్ లతో మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆకస్మిక గుండెపోటుతో యువకులు, చిన్నపిల్లలతో సహా అన్ని వయస్సుల వారు విషాదకర పరిస్థితుల్లో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి సంబంధించిన భయంకరమైన వీడియోలు సోషల్ మీ డియాలో తరుచుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మరణాల గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్ లోని రాజసమండ్ లో జరిగింది. రెస్టారెంట్ లో భోజనం చేసి బిల్లు చెల్లిస్తుండగా గుండెపోటుతో యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాదకర దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. అప్పటివరకు ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉన్న యువకుడు అంతలోనే మరణించడం అక్కడున్నవారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‼️??Silent genocide continues in India!!
— Rohit Mishra (@RohitMishra2024) March 5, 2025
एक युवक खाना खाने के बाद होटल का बिल चुकाने काउन्टर पर जाता है और फिर बिल देखता है तभी अचानक हार्ट अटैक आकर 27 साल के युवक की मौत हो जाती है? आखिर क्या कारण हैं कि लोगों की अचानक मौत हो रही है?गंभीर सवाल हैं ?https://t.co/XlnfjhTtHV pic.twitter.com/8VGmk87FnW
రెస్టారెంట్ లో బిల్లు చెల్లించేందుకు కౌంటర్ దగ్గరకు వెళ్లిన యువకుడు సడెన్ హార్ట్ అటాక్ తో ఎలా కుప్పకూలాడో వైరల్ వీడియాలో కనిపిస్తుంది. క్యాషియర్ బిల్లు ఇచ్చిన తర్వాత యువకుడు కౌంటర్ పై కుప్పకూలడం ఆ తర్వాత నేలపై పడిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యువకుడు స్పాట్ లో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ | వీల్చైర్ లేక ఆస్పత్రిపాలైన లెఫ్టినెంట్ జనరల్ భార్య..ఎయిర్ ఇండియాపై ప్యాసింజర్ల ఆగ్రహం
పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన 27యేళ్ల సచిన గరు రాజసమండ్ మునిపల్ శాఖలో శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి పోలీస్ డిపార్టుమెంట్ లో పనిచేస్తున్నాడు. మార్చి 1న స్థానికంగా ఓ రెస్టారెంట్ కు భోజనానికి వెళ్లిన సచిన్.. భోజనం తర్వాత బిల్లు చెల్లించేందుకు కౌంటర్ దగ్గరకు వెళ్లాడు.. క్యాషియర్ బిల్లు ఇవ్వగా డబ్బులు తీసి ఇచ్చే క్రమంలో సచిన్ గుండెపోటు వచ్చింది. దీంతో కౌంటర్ పై పడి ఆతర్వాత కిందపడిపోయాడు. హోటల్ సిబ్బంది అతన్ని లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయాడు.
ఈ విషాదకరమైన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సడెన్ హార్ట్ అటాక్ లతో పెరుగుతున్న మరణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. దేశంలో కార్డియాక్ అరెస్ట్ తో యువకులు, పిల్లలు కూడా చనిపోతున్నారు. ప్రభుత్వాలు దీనిని సీరియస్ గా తీసుకొని ఈ మరణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.