
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ఎంఐఎం అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ముష్కరులను మోదీ, అమిత్‌షా వదలరు: రాజాసింగ్
కాశ్మీర్ లో ఆర్టికల్370ని రద్దు చేసిన తర్వాత ప్రశాంతంగా ఉందని, అది ఓర్వలేకే టెర్రరిస్టులు ఈ దాడులకు తెగబడ్డారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కాశ్మీర్‌ను కేంద్రం డెవలప్ చేసిందని, దాడి చేసిన టెర్రరిస్టులను పట్టుకుని చంపేవరకు మోదీ, అమిత్ షా వదలరన్నారు.