
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. పర్యాటకులపై కాల్పులకు దిగటం ఉగ్రవాదుల పిరికచర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి బాధ కలిగించిందని అన్నారు.
ఉగ్రదాడి ఘటనపై హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడాని, కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెప్పారని తెలిపారు. ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన సమయం సూచించారు. ఈ దాడిని మంతం కోణంలో చూడరాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే విధంగా కశ్మీర్ లోని కాంగ్రెస్ నాయకులతో మాట్లాడామని, బాధితులకు సహాయక చర్యలలో పాల్గొనాలని చెప్పినట్లు తెలిపారు.
బాధితులను కేంద్రం ఆదుకోవాలని కోరారు. ఘటనలలో చనిపోయిన మృతులను వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఈ ఘటనపై చర్చించేందుకు గురువారం (ఏప్రిల్ 24) ఢిల్లీలో సీడబ్ల్యూ సీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.