పాక్‎లో టెర్రర్ అటాక్.. ఐదుగురు సోల్జర్లు మృతి

పాక్‎లో టెర్రర్ అటాక్.. ఐదుగురు సోల్జర్లు మృతి

పెషావర్: పాకిస్తాన్‎లో టెర్రర్ అటాక్ చోటు చేసుకుంది. ఆర్మీ వాహనంపై మిలిటెంట్లు మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సోల్జర్లు చనిపోయారు. ఆదివారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‎లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దారాబన్ తహసీల్‎లో చోరీకి గురైన పారామిలిటరీ ట్రక్కును రికవరీ చేయడానికి సైనికులు మరో ట్రక్కులో బయలుదేరారు. ఈ క్రమంలో సైనికులపై టెర్రరిస్టులు మెరుపుదాడి చేశారు. 

చనిపోయిన వారిలో నలుగురు పారా మిలిటరీ సిబ్బంది, ఓ సాధారణ పౌరుడు ఉన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, బలూచిస్తాన్‎లో టెర్రరిస్టుల కార్యకలాపాలను అరికట్టడానికి భద్రతా దళాలు దేశవ్యాప్తంగా యాంటీ టెర్రర్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే శనివారం బలూచిస్తాన్‎లో లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు వేర్వేరు ఆపరేషన్లు చేపట్టి 23 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టాయి.