పాక్ నేవీ బేస్‌పై టెర్రర్ దాడికరాచీ: పాకిస్తాన్లో అతిపెద్ద నేవీ ఎయిర్‌బేస్ లలో ఒకటైన పీఎన్ఎస్ సిద్ధిఖ్‌పై సోమవారం రాత్రి టెర్రర్ దాడి జరిగింది. బలూచిస్తాన్‌లో ఉన్న ఈ స్థావరంపై టెర్రరిస్టులు తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. అప్రమత్తమైన పాక్ భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ సైనికుడు చనిపోయాడు. ఎయిర్ బేస్ మూడు వైపులనుంచి టెర్రరిస్టులు దాడికి దిగారని, భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకోగలిగారని మాక్రాన్ కమిషనర్ సయీద్ అహ్మద్ ఉమ్రానీ తెలిపారు. ఈ ఘటనలో ఎయిర్ బేస్కుగానీ, విమానాలకుగానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. అయితే బలూచిస్తాన్ ఫ్రాంటియర్ కోర్కు చెందిన 24 ఏండ్ల సైనికుడు మృతిచెందడం విచారకరమని వెల్లడించారు. కాగా, తుపాకీ శబ్దాలు, బాంబుల మోతలతో రాత్రంతా భయాందోళనల మధ్య గడిపామని స్థానికులు చెప్పారు.
-
దాడి చేసింది మేమే: బీఎల్ఏ
పాకిస్తాన్ నేవీ ఎయిర్ బేస్ సిద్ధిఖ్‌పై దాడి చేసింది తామేనని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) వెల్లడించింది. ఈ దాడిలో తమ మజీద్ బ్రిగేడ్ పాల్గొన్నట్టు వెల్లడించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.