శౌర్య చక్ర అందుకున్న రైతు ఇంటిపై టెర్రరిస్టుల కాల్పులు

శౌర్య చక్ర అందుకున్న రైతు ఇంటిపై టెర్రరిస్టుల కాల్పులు

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 4గంటలకు ఉగ్రవాదులు దాడులు చేశారు. శౌర్యచక్ర అవార్డ్ గ్రహిత పర్షోతమ్ కుమార్ నివాసాన్ని టార్గెట్ గా చేసుకొని టెర్రరిస్టు కాల్పులు జరిపారు. రెండు గ్రూపులుగా విడిపోయి ఆర్మీ సెక్యూరిటీ పోస్ట్, శౌర్యచక్ర గ్రహీత పర్షోతమ్ కుమార్ నివాసంపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ జవాన్, పర్షోత్తమ్ కుమార్ బంధువు గాయపడ్డారు. కాల్పుల తర్వాత జిల్లాలోని గుండా ప్రాంతంలో సెర్చ్ మరియు కార్డన్ ఆపరేషన్ నిర్వహించింది ఇండియన్ ఆర్మీ.

Also Read :- శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన

కుమార్ ఒక రైతు, గ్రామ రక్షక బృందం లేదా గ్రామ రక్షణ కమిటీ (VDC) సభ్యుడు. పర్షోతమ్ దేశభక్తికి ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శౌర్య చక్రను అవార్డ్ అందుకున్నారు. కాల్పుల అనంతరం అప్రమత్తమైన సైన్యం ప్రతిదాడి చేసింది. సైన్యం చేసిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టు మృతి చెందాడు.