- ఐఎస్ఐ అందజేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల వెల్లడి
- భద్రతా బలగాల్లో కలవరం
- అఫ్గాన్‌లో యూఎస్ సైనికులు వదిలిపెట్టిన ఆయుధాలేనని నిర్ధారణ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన అత్యంత పవర్ ఫుల్ వెపన్స్ పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతికి చిక్కడం భద్రతా బలగాల్లో ఆందోళన కలిగిస్తోంది. 2021లో అఫ్గానిస్తాన్ నుంచి వాపస్ పోయే టైంలో అమెరికా సైన్యం దాదాపు రూ.6 లక్షల కోట్ల విలువైన వెపన్స్‌ను అక్కడే వదిలేసింది. వాటిలో వేలాదిగా ఎం4 రైఫిల్స్ ఉన్నాయి. బులెట్ ప్రూఫ్‌ను కూడా ఛేదించగల కెపాసిటీ ఉన్న ఆ వెపన్స్.. కాశ్మీర్‌లోకి చొరబడిన టెర్రరిస్టుల వద్ద తరచుగా లభిస్తున్నాయి. ఈ ఆయుధాలను పాక్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ(ఐఎస్ఐ)నే టెర్రరిస్టులకు అందజేస్తున్నట్లు మన దేశ ఇంటలిజెన్స్ వర్గాలు సందేహిస్తున్నాయి.
పుల్వామాలో ఫస్ట్ టైం..
ఎం4 రైఫిల్స్ తో ఇటీవలి కాలంలో మనదేశ భద్రతా బలగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జైషే మహ్మద్‌కు చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు తల్హా రషీద్ మసూద్‌ను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టినప్పుడు ఎం4 రైఫిల్ తొలిసారి పుల్వామాలో కనిపించింది. అనంతరం కథువా, రియాసి, పూంచ్ సెక్టార్, రాజౌరిలో జరిగిన టెర్రరిస్టుల దాడుల సమయంలోనూ ఎం4 కార్బైన్ వెపన్స్ కనిపించాయి. తాజాగా ముగ్గురు టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేసిన కాశ్మీర్‌లోని అఖ్నూర్ ప్రాంతం నుంచి కూడా ఎం4 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఎంత పవర్ఫుల్ అంటే..
ఎం4 కార్బైన్ అనేది తేలికైన, గ్యాస్- ఆపరేటెడ్, ఎయిర్-కూల్డ్, మ్యాగజైన్-ఫెడ్ అసాల్ట్ రైఫిల్. ఇవి బులెట్ ప్రూఫ్ నుంచైనా చొచ్చుకుపోగలి గే కెపాసిటీ కలిగి ఉన్నాయి. 500 మీటర్ల దూరంలోని టార్గెట్‌ను సులభంగా ఫైరింగ్ చేయగలిగే ఈ రైఫిల్‌తో నిమిషానికి 700 నుంచి 900 రౌండ్లు కాల్చవచ్చు. దీని మ్యాగ్జిమమ్ ఫైరింగ్ పరిధి 3,600 మీటర్లు.