పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రం రరాషమ్ జిల్లా ముసాఖేల్ సమీపంలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఆగస్ట్ 26 (సోమవారం) ఉదయం అంతర్ -ప్రాంతీయ రహదారిపై బస్సులో ప్రయాణీకులను ఉగ్రవాదులు అడ్డుకొని, కాల్పులు జరిపారు. బస్సు నుంచి బలవంతంగా ప్యాసింజర్లను కిందకి దించి వారి ఐడెంటిటీ చెక్ చేసి తుపాకులతో కాల్చి చంపారు టెర్రరిస్టులు. అంతే కాదు రోడ్డు పై ఉన్న 10 వాహనాలకు నిప్పు పెట్టారని అసిస్టెంట్ కమిషనర్ ముసాఖైల్ నజీబ్ కాకర్ మీడియాలకు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన 23 మందిలో చాలామంది పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.
ఈ కాల్పులపై దాడి తామే చేసినట్లు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ ఘటనను ఖండిస్తూ బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి, సంతాపం తెలిపారు. ఈ ఘటనను ఖండిస్తూ బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.