
ఎలన్ మస్క్ ఇండియాలోకి అడుగు పెట్టేశారు. టెస్లా కార్లు, ఎలన్ మస్క్ ప్రాడెక్టులను అమ్ముకోవటానికి రెడీ అయిపోయారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత.. మస్క్ అత్యంత వేగంగా ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే టాప్ పొజిషన్ లో 13 మందిని నియమించుకోవాలని నిర్ణయించినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
టెస్లా జాబ్ ఓపెనింగ్స్ ఇలా :
1. సర్వీస్ టెక్నీషియన్
2. సర్వీస్ మేనేజర్
3. ఇన్ సైడ్ సేల్స్ అడ్వయిజర్
4. కస్టమర్ సపోర్ట్ సూపర్ వైజర్
5. కస్టమర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
6. ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
7. సర్వీస్ అడ్వయిజర్
8. టెస్లా అడ్వయిజర్
9. పార్ట్స్ అడ్వయిజర్
10. డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
11. బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్
12. స్టోర్ మేనేజర్
ఇండియాలో టెస్లా ఆపరేషన్స్ ప్రారంభించటానికి తొలి అడుగుగా టాప్ లెవల్లో ఈ రిక్రూట్ మెంట్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు లింక్డ్ ఇన్ లో పోస్టులు కనిపిస్తున్నాయి.
ఇదే విధంగా ఇండియాలో మూడు చోట్ల టెస్లా ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని.. ఒకటి గుజరాత్, మరొకటి ఏపీ, మరో ప్రాంతం అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. టెస్లా ప్లాంట్లతోపాటు ఇండియాలో మూడు షోరూమ్స్ ప్రారంభించాలని కూడా భావిస్తుంది కంపెనీ. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సిటీల్లో టెస్లా ఎక్స్ క్లూజివ్ షోరూమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తుంది టెస్లా.
ALSO READ | ఎన్హెచ్ఏఐలో మేనేజర్ పోస్టులు
విదేశీ కార్లపై భారీగా సుంకాలు విధిస్తుండటంతో ఇన్నాళ్లు టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయింది. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ, ఎలన్ మస్క్ భేటీ తర్వాత.. విదేశీ కార్లపై ఉన్న సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో టెస్లా కార్ల ఎంట్రీకి రూట్ క్లియర్ అయ్యింది.