Trump: ఇంటర్నెట్ ను షేక్ చేసిన ఎలాన్ మస్క్ కొడుకు, ట్రంప్ వీడియో..ఎలాన్ మస్క్ పుత్రోత్రాహం..

Trump: ఇంటర్నెట్ ను షేక్ చేసిన ఎలాన్ మస్క్ కొడుకు, ట్రంప్ వీడియో..ఎలాన్ మస్క్ పుత్రోత్రాహం..

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొడుకుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వేలు పట్టుకొని విమానం ఎక్కుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. టుడే బెస్ట్ ఫిక్చర్ గా వీరిద్దరి ఫొటో.. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. అమెరికా అధ్యక్షుడిగా సీరియస్ నిర్ణయాలతో గంభీరంగా ఉండే ట్రంప్.. మస్క్ కొడుకుతో సరదాగా మాట్లాడుతూ, వేలు పట్టుకొని నడిపిస్తూ విమానం ఎక్కించడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. 

ఎలాన్ మస్క్ టెస్లా సిలికాన్ వ్యాలీ ఈ ఫొటోలను ఇంటర్నెట్ లో షేర్ చేసింది. ఈ రోజు ఇంటర్నెట్ ను గెలుచుకున్న ఫొటో అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వైట్ హౌజ్ సౌత్ లాన్ తీసిన వీడియో అది. ట్రంప్ లిల్ ఎక్స్ ను మెరిన్ వైపు తీసుకెళ్తున్నట్లు చూపిస్తుంది. ఎలాన్ మస్క్ కొడుకు ఎగురుతూ ట్రంప్ తో  ముచ్చట్లు చెబుతూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అధ్యక్షుడు ఫోటోగ్రాఫర్ల వైపు చేయి ఊపుతూ లిటిల్ ఎక్స్ హెలికాప్టర్ మెట్లు ఎక్కడానికి సహాయం చేశాడు. తన హార్డ్ నెస్సే కాదు.. సున్నితత్వం కూడా ఉందన్నట్లు ఓ లుక్ ఇచ్చాడు.ఇది సోషల్  మీడియాను బాగా ఆకర్షించింది. 

ఇక ఈ వీడియోపై తెగ కామెంట్లు పెట్టారు. లిల్ ఎక్స్, ట్రంప్ ప్రేమగా మాట్లాడుకోవడాన్ని నెటిజన్లు అమితంగా ఇష్టపడ్డారు. హ్యాష్ ట్యాగ్ లతో ముంచెత్తారు.  #GrandpaTrump వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. చాలా మంది ట్రంప్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేశారు. ఇక చిన్న X ఫ్యూచర్ ను కూడా ఊహించారు. లిల్ ఎక్స్ భవిష్యత్తులో ట్రంప్ అడుగుజాడల్లో నడుస్తూ అంతటివాడవుతాడని ప్రశంసించారు. 

ALSO READ | గ్రీన్‌‌‌‌‌‌‌‌కార్డుతో ఎల్లకాలం అమెరికాలో ఉండలేరు: అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్

లిల్ ఎక్స్ ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇది మొదటి సారి కాదు.. చాలాసార్లు వైట్ హౌజ్ అధికారిక కార్యక్రమాల్లో కూడా కనిపించాడు. ఓవెల్ ఆఫీసుకు వచ్చిన వారందరిని మంత్రముగ్దులను చేశాడు. మోస్ట్ ఇంటెలిజెంట్.. అధిక ఐక్యూ కలిగిన వ్యక్తి అని లిల్ ఎక్స్ గురించి డొనాల్డ్ చాలా గొప్పగా అందరికి పరిచయం కూడా చేశారు. 

ఇక ఈ పోస్టుపై ఎలాన్ మస్క్ హ్యాపీగా స్పందించారు. పుత్రోత్సాహం ప్రకటించారు. చాలా అద్భుతమైన ఫొటో.. చాలా సంతోషం అంటూ రీపోస్ట్ చేశారు.