Tesla Layoffs: టెస్లా షాక్.. 2 వేల 700 మంది ఉద్యోగులను తీసేసిన ఎలన్ మస్క్

2700 మంది ఉద్యోగులను తీసేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా.ఆస్టిన్ లోని టెస్లా ఫ్యాక్టరీలో పని చేస్తున్న 2,688 మంది ఉద్యోగులకు మందికి లేఆఫ్ నోటీసులు ఇష్యూ చేసింది టెస్లా సంస్థ. యూఎస్ లేబర్ చట్టంలోని WARN యాక్ట్ ప్రకారం ఏ ఉద్యోగిని అయినా సంస్థ నుండి తీసేయాలంటే 60రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలన్న నిబంధన ప్రకారం ఈ లేఆఫ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది టెస్లా. ఆ రకంగా జూన్ 14నుండి టెస్లాలో లేఆఫ్ లు మొదలు కానున్నాయి.

2020 లేఆఫ్ తర్వాత జరగనున్న ఈ లేఆఫ్ లకు కారణం సంస్థ వార్షిక ఆదాయం తగ్గటమే అని తెలుస్తోంది. 2020 లేఆఫ్స్ తర్వాత టెస్లా మొదటిసారి వార్షిక ఆదాయాన్ని ప్రకటించనుంది. గత వారంలో ఆక్సిలరేటర్ లోపం ఉన్న 4000 సైబర్ ట్రక్స్ ని రీకాల్ చేసింది టెస్లా. ఈ రికాల్స్ తర్వాత మస్క్ AI మీద ఫోకస్ పెట్టాడు.