Tesla Robotaxi:టెస్లా రోబోటాక్సీ డ్రైవర్‌లెస్ కారు..ఫీచర్లు ఇవే, ధర ఎంతంటే

Tesla Robotaxi:టెస్లా రోబోటాక్సీ డ్రైవర్‌లెస్ కారు..ఫీచర్లు ఇవే, ధర ఎంతంటే

సరికొత్త రోబోటాక్సీ కారును లాంచ్ చేశారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఇది సైబర్ ట్రక్ డిజైన్ కలిగిన డ్రైవర్ లెస్ కారు. రోబోటాక్స్ ని అకా సైబర్ క్యాబ్ అని పిలుస్తారు. తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్, రోబోవాన్ పూర్తిస్థాయి సెల్ఫ్ ఆపరేటింగ్ వ్యాన్ గురించి మరిన్ని వివరాలు టెస్లా కంపెనీ వెల్లడించింది. 

చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సెల్ఫ్ ఆపరేటింగ్ ట్యాక్సీని రివీల్ చేసింది టెస్లా. అకా సైబర్ క్యాబ్ అని పిలువబడే రోబోట్యాక్సీని గురువారం అర్థరాత్రి కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రో లో జరిగిన ఓ ఈవెంట్ లో వెల్లడించారు. 

ఎలాన్ మస్క్ సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలను 2020లో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వ్యాల్యూమ్ ఉత్పత్తి చివరికి 2024కి టైమ్ లైన్ కు మారింది. టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ పూర్తిగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది.దీనికి స్టీరింగ్ వీల్ , పెడల్స్ ఉండవు. 

 ఈ డ్రైవర్‌లెస్ కారులో టెస్లా మోడల్ 3 , మోడల్ Y వంటి డాష్‌లు ఉన్నాయి.మధ్యలో స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రోబోట్యాక్సీలో రెండు డోర్ల హ్యాచ్ బ్యాక్ కేవలం రెండు సీట్లతో మాత్రమే ఉంటుంది. అయితే ఇది పెద్ద కార్గో ఏరియాను కలిగి ఉందని ఫొటోలు చూపిస్తున్నాయి. వెనుక కిటీకి కూడా లేదు. 

Also Read : AI టెస్లా రోబో ట్యాక్సీ కారు

ముందు వెనకా లైట్ బార్లతో అట్రాక్టివ్ గా ఉంటుంది. చక్రాలు డిస్క్ లాంటి కవర్లను కలిగి ఉన్నాయి. రోబోటాక్సీకి జనరల్ గా ఉండే ఛార్జింగ్ పోర్ట్ లేదు.. ఎందుకంటే ఇది వైర్ లెస్ ఛార్జింగ్ సిస్టం కలిగి ఉంటుంది. 

రోబోటాక్సీ ధర విషయానికి వస్తే.. ఎలాన్ మస్క్ దీని ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయినా ఎలాన్ చెప్పిన వివరాలను బట్టి ..దీని ధర 30వేల డాలర్లు ఉంటుందని.. ఇండియన్ కరెన్సీలో 25 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. టెస్లా రోబె టాక్సీ.. Uber  ఎలా పనిచేస్తోంది అదే విధంగా పనిచేస్తుందన్నారు ఎలాన్ మస్క్.