
కార్ల కొనుగోలుదార్లకు గుడ్న్యూస్..ప్రముఖ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ ఆటోమేకర్ టెస్లా ఇండియాలో షోరూమ్లను ప్రారంభించనుంది. మొదటి షోరూమ్ ను ముంబైలోని బాంద్రా కుర్ల కాంప్లెక్స్లో ఓపెన్ చేయనుంది. ఇండియాలో మొదటి వెంచర్‌లో తన కార్ మోడళ్లను ప్రదర్శించడానికి ఒప్పందాన్ని ఖరా రు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇండియాలో టెస్లా బిజినెస్ విస్తరణకోసం ప్రయత్నిస్తున్న ఎలాన్ మస్క్ ఉద్యోగ రిక్రూట్ మెంట్లు చేపట్టారు. ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత ఆదివారం (మార్చి 2) షోరూం ల ఏర్పాటుకు ముంబైలో స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. దీంతో ఇండియాలో కార్ల బిజినెస్ లోకి ఎలాన్ మస్క్ ఎంట్రీ ఖరారయ్యింది.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) వాణిజ్య టవర్‌లో 4వేల చదరపు అడుగుల స్థలాన్ని ఐదేళ్లపాటు లీజుకు తీసుకుంది.నెలకు రెంట్ రూ. 35లక్షలు. ఇక్కడ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ తన మోడల్‌లను ప్రదర్శించనుంది.
Also Read : దిగొస్తున్న బంగారం ధర
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా టెస్లా కార్ల షోరూంను ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ ఎయిరోసిటీ కాంప్లెక్స్ లో రెండో షోరూమ్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దమవు తోంది.
ఇటీవల ప్రధాని మోదీతో సమావేశం తర్వాత ఎలాన్ మస్క్..ఇండియాలో టెస్ల కార్ల ఉత్పత్తుల అమ్మకానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రిక్రూట్మెంట్ కూడా ప్రారంభించారు. లింక్డ్ ఇన్ లో పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలకు కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఢిల్లీ, ముంబైలలో కస్టమర్ సపోర్ట్, ఆపరేషన్లు,బిజినెస్ సపోర్ట్ వంటి ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఇచ్చారు.