కారు అనగానే డ్రైవర్ కామన్.. సొంత కారు అయినా అద్దె కారు అయినా డ్రైవ్ చేయకుండా ముందుకు వెళ్లదు. అయితే ఇది ఒకప్పటి మాటగా ఇక మిగిలిపోనుంది.. డ్రైవర్ లెస్ కార్లు..అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయి. డ్రైవర్ లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి అనేది మ్యాప్లో ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటే చాలు..చక్కగా అక్కడికి తీసుకెళ్లిపోతుంది..
Teslas now drive themselves from their birthplace at the factory to their designated loading dock lanes without human intervention
— Tesla AI (@Tesla_AI) January 29, 2025
One step closer to large-scale unsupervised FSD pic.twitter.com/Aj6dHsLaRO
ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా నుంచి ఈ కార్లు వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తో పని చేసే డ్రైవర్ లెస్ కార్లు టెస్ట్ డ్రైవ్ విజయవంతం అయినట్లు ప్రకటించింది టెస్లా. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది. ఈ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
టెస్లా కంపెనీ తయారు చేసిన ఏఐ ఆధారంగా పనిచేసే ఈ డ్రైవర్ లెస్ కారు..బుధవారం (జవనరి 29) నాడు జన్మస్థలం అయిన కంపెనీ నుంచి నిర్ధేశించబడిన ప్రాంతానికి ట్రయల్ రన్ మొదలుపెట్టింది. డ్రైవర్ లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ తో లోడింగ్ చేయబడిన డాక్ లేన్ కు తనను తానే నడుపుకుంటూ వెళ్లింది.. దాదాపు మూడు కిలోమీటర్లు అన్ని అడ్డంకులను అధిగమించి సునాయాసనంగా గమ్యస్థానం చేరుకుంది. ఇక ఎక్కువ దూరం డ్రైవింగ్ టెస్ట్ మిగిలి ఉంది.. ఇది పూర్తి కాగానే ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై డ్రైవర్ లేకుండా సొంతంగా పరుగులు పెట్టనుంది.
ALSO READ | ఇస్రోకు వందో ప్రయోగం కీలక మైలురాయి.. ఇస్రో చైర్మన్ నారాయణన్