
- తార్రోడ్డుకు కూల్ పెయింట్ వేయాలంటున్న భక్తులు
ప్రతి ఏటా ఎండాకాలంలోబాసరలో అమ్మవారి దీక్ష చేపట్టే సరస్వతీ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిప్పులు చిమ్మే తార్రోడ్డు మీద నడవడంవల్ల వాళ్ల కాళ్లు బొబ్బలెక్కుతున్నా యి. మధుకరదీక్ష చేపట్టిన భక్తులు రోజూ పొద్దున తెల్ల బట్టలు కట్టుకుని అమ్మవారి సన్నిధి నుండి ఊళ్లోని వెళ్ళి భిక్షాటన చేస్తారు. గుడి నుంచి బాసర ఊళ్లోకి వెళ్లాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు తారు రోడ్డు మీద నడవాలి. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. పొద్దున 9 గంటలకే తారురోడ్డు భగభగమంటోంది. దీంతో భక్తుల కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి. భక్తులు, విద్యార్థుల దీక్షల నేపధ్యంలో రోడ్డుమీద కూల్ పెయింట్ వేయాలని, లేదంటే కనీసం మ్యాట్లు వేయాలని కోరుతున్నారు. ఏటేటా దీక్ష చేపడుతున్న వారు పెరుగుతున్నా.. వారి కష్టాలన్ని ఆలయ అధికారులు పట్టించుకోవడంలేదు. కఠిన నియమాలతో చేసే ఈ అనుష్టాన దీక్షలు వందల ఏళ్లుగా జరుగుతున్నాయి. గురువారం ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి.త్వరలో టెన్త్ రిజల్ట్స్ రానున్నా యి. దీంతో దీక్షలు చేసేందుకు చాలామంది బాసరకు వస్తారు. వారి కి తగిన సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.