
- ఉ:9.30 నుంచి స్పోర్ట్స్18లో
చెన్నై: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా విమెన్స్ టీమ్.. సౌతాఫ్రికాతో టెస్టు సవాల్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు ఇక్కడి చెపాక్ స్టేడియంలో గురువారం మొదలవనుంది. ఇండియా, సౌతాఫ్రికా ఈ ఫార్మాట్‌లో దాదాపు పదేండ్ల తర్వాత తొలిసారి తలపడుతున్నాయి. వన్డే సిరీస్ నెగ్గిన జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఆతిథ్య జట్టు ఆశిస్తోంది.
వన్డేల్లో తేలిపోయిన నేపథ్యంలో రెడ్ బాల్‌తో అయినా ఇండియాకు గట్టి పోటీ ఇవ్వాలని సఫారీలు కోరుకుంటున్నారు. ఆతిథ్య జట్టులో ప్రియా పునియా, ఉమా ఛెత్రి, సైకా ఇషాక్, అరుంధతి రెడ్డి, షబ్నమ్ షకీల్‌లో ఒకరిద్దరు ఈ పోరుతో టెస్టు అరంగేట్రం చేయనున్నారు.