Summer Fruits : ఫ్రూట్స్ ఎలా పడితే అలా తినొద్దు.. టెస్ట్ చేయండి.. క్లీన్ చేసి తినండి.. !

Summer Fruits : ఫ్రూట్స్ ఎలా పడితే అలా తినొద్దు.. టెస్ట్ చేయండి.. క్లీన్ చేసి తినండి.. !

సమ్మర్ కదా, ఏ ఫ్రూట్ మార్కెటికి వెళ్లినా పసుపు రంగులో మామిడి పళ్లు నిగనిగలాడుతూ నోరూరిస్తుంటాయి. వాటితోపాటు అరటి, జామ, యాపిల్, బొప్పాయి.. ఇలా రకరకాల పండ్లన్నీ మిలమిలా మెరుస్తూ ఆకట్టుకుంటాయి. అంతలా కంటికి ఇంపుగా కనిపిస్తుంటే వెంటనే వాటిని కొనుక్కుని తినేయాలనిపిస్తుంది. అయితే పైకి అలా ఆకర్షణీయంగా కనిపించే పండ్లన్నీ నిజంగా చెట్టుకి మగ్గినవి కావనీ, అవన్నీ రసాయనాల పూరితమని, ఫ్రూట్స్తో పాటే రసాయనాలను కూడా మింగేస్తున్నారని మీకు తెలుసా?
 
మార్కెట్లో దొరికే ప్రతీ ఫ్రూట్ కి ఒక సీజన్ ఉంటుంది. అది ఆ సీజన్లోనే ఎక్కువగా లభిస్తుంటుంది. అయితే సీజన్లో సంబంధం. లేకుండా కొన్నిపండు సంవత్సరం పొడవునా లభిస్తుంటాయి. అలాంటివన్నీ కృత్రిమంగా రసాయనాల ద్వారా పండించినవే. వేసవికాలంలో మామిడి పండ్లతోపాటు చాలారకాల పండ్లలో 'రైపనింగ్ ఏజెంట్స్" వినియోగం ఎక్కువగా ఉంటుంది. డైపనింగ్ ఏజెంట్స్ అంటే.. క్యాల్షియం కార్సైడ్, ఇథిలీన్ లాంటి రసాయనాలు, వీటిని ఉపయోగించి పండ్లకు కృత్రిమంగా రంగు తెప్పించి పండిస్తుంటారు.


ఇంకోటి కోటింగ్, పండ్లు నున్నగా మెరుస్తూ కనపడేందుకు ఫ్రూట్పీ కోటింగ్ వేస్తారు. ముఖ్యంగా మామిడి, యాపిల్స్లో దీని కోసం వ్యాక్సిన్ను వాడతారు . వ్యాక్స్ అనేది పెట్రోలియం ప్రొడక్ట్. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇవి కాక, పండ్లు, కూరగాయలు పండించేటపుడు కొన్ని ఎరువులు, రసాయనాలు వాడటం సహజం. ఇవి కూడా పండ్ల పైపొరల్లో ఉండి పోతాయి. వీటిని నేరుగా తీసుకోవడం. ద్వారా కూడా శరీరంలోకి కూడా రసాయనాలు వెళ్లిపోతాయి.  రసాయనాలను కలిపిన పండ్లను తింటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు వేసి పండించిన పండ్లను తింటే.. వాటిలో ఉండే పోషక విలువలు దెబ్బ తింటాయి. కాబట్టి వాటిని తిన్నా పెద్ద ప్రయోజనం ఉండదు. దీనికి తోడు విష పదార్థాలు శరీరంలోకి చేరి అనేక రకాల అనారోగ్యాలకు కారణం అవుతాయి.
నష్టాలు ఇవీ....
 వాంతులు, విరేచనాలు, డయేరియా సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గాజీర్ణం కాదు. చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తాయి. విపరీతమైన దాహం వేస్తుంది. నోరు, ముక్కు, గొంతు ఇన్ ఫెక్షన్లు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, చర్మ, జుట్టు సమస్యలు, బ్రెయిన్, కిడ్నీ, లివర్ సమస్యలు కూడా రావొచ్చు. ఒక్కోసారి వీటి ప్రభావం క్యాన్సరు కూడా దారి తీసే ప్రమాదముంది.

పండ్లు కొనే విషయంలో గుర్తు పట్టడం చాలా ఈజీ మోసపోకూడదంటే ఏ సీజన్లో పండే వాటిని ఆసీజన్లలోనే కొనాలి. సీజన్కు ముందే మార్కెట్ లోకి వచ్చిన పండ్లను కొనడం అంతమంచిది కాదు. మే చివరి నుంచి జులై వరకు మామిడి పండ్ల అసలైన సీజన్. అప్పుడే మార్కెట్లోకి సహజంగా మగ్గిన పండ్లు వస్తాయి. అలా కాకుండా సీజన్ కంటే ముందు వచ్చే వాటిలో చాలా వరకు కృత్రిమంగా పండించినవే... 

 మామిడి పండ్లు కొన్నాక మంచివా, కల్తీదా అని గుర్తించాలంటే పండ్లను బకెట్ నీళ్లలో వేసి చూడాలి. మామిడి పండునీళ్లలో మునిగితే ఆ పండు సహజంగా పండినట్టు.. ఒకవేళ నీళ్లలో తేలితే కృత్రిమంగా పండించారని అర్థం. మార్కెట్ లో పండ్ల రంగు చూసి మోసపోకూడదు. పళ్లన్నీ ఒకేరకంగా, ఒకే రంగులో ఉన్నా, తొక్కమీద నల్లటి మచ్చలున్నా అవి కృత్రిమంగా మగ్గినవేనని అర్ధం చేసుకోవచ్చు. ౦ కృత్రిమంగా పండించిన పండ్లన్నీ దాదాపుగా ఒకే రంగులో ఉంటాయి. రంగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. అదే సహజ సిద్ధంగా పండినవైతే రంగుల్లో తేడా ఉంటుంది. అన్ని పండ్లు ఒకే రంగులో ఉండవు. ఒకే జాతి అయినప్పటికీ వేరువేరు
రంగుల్లో ఉంటాయి.

  •  అరటి పండు తొడిమ గ్రీన్ కలర్లో ఉండి పండు పసుపు రంగులో ఉంటే అవి కృత్రిమంగా పండించినవే. సహజ సిద్ధంగా పండినవయితే తొడిమ కూడా పసుపు రంగులోనే ఉంటుంది.
  •  సహజ సిద్ధంగా పండిన కూరగాయలు, పండ్లు ఆకర్షణీయంగా ఉండవు. కానీ కృత్రిమంగా పండినవాటి రంగు మెరుస్తుంటుంది. ఆ రంగును బట్టి గుర్తుపట్టేయొచ్చు.
  •  కృత్రిమంగా పండిన పండ్లు మెత్తగా, మృదువుగా ఉంటాయి. సహజ సిద్ధంగా పండినవి కొంచెం గట్టిగా ఉంటాయి. రంగును చూసి మోసపోకుండా.. కాయను సున్నితంగా నొక్కి తొడిమల దగ్గర మంచి వాసన వస్తుందా అని చూడాలి..

ఇలా చేయాలి

 మనం తినే పండ్లు, కూరగాయల మీద ఉండే రసాయనాలు, క్రిములను పూర్తిగా పోయేలా శుభ్రం చేయడానికి కొన్ని పద్దతులున్నాయి. ౦ కూరగాయలను గోరు వెచ్చని నీళ్లలో వేసి కడగడం వల్ల వాటిపై ఉండే రసాయనాలు పోతాయి. చల్లని నీళ్లతో కడిగేట్లయితే స్క్రబ్బర్ వాడాలి. దాంతో కూరగాయలను బాగా రుద్దాలి. అలా చేస్తేనే వాటిపై ఉండే రసాయనాలు వదులుతాయి. 

పండ్లు, కూరగాయల మీద చేరిన పెస్టిసైడ్స్ ను ప్రభావ వంతంగా తగ్గించడంలో బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఒక ఐకెట్ లో నీళ్లు నింపి, అందులో ఒక నాలుగు చెంచాల బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఈ నీళ్లలో పండ్లు, కూరగాయలు వేసి పావుగంట తర్వాత శుభ్రం చేసి, తిరిగి మంచి నీళ్లతో కడిగి ఉపయోగించుకోవాలి. ౦ పండ్లు, కూరగాయల మీద చేరిన క్రిములను, బ్యాక్టీరియాను వెనిగర్ కూడా నాశనం చేస్తుంది.

ఒక బకెట్ లో కొద్దిగా నీళ్లు నింపి, అందులో వైట్ వెనిగర్ ఒక కప్పు వేసుకోవాలి. ఆ నీళ్లలో ఐదు నిముషాలు పండ్లు, కూరగాయలు..వేయడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు నాశనం అవుతాయి.  స్ప్రే సీసాలో ఒక చెంచా నిమ్మరసం, రెండు చెంచాల వెనిగర్, ఒక కప్పు నీళ్లు కలుపుకొని ఇంట్లోనే వెజిటబుల్ స్ప్రే తయారుచేసుకోవచ్చు. దీన్ని పండ్లు లేదా కూరగాయల మీద చల్లి బలంగా రుద్ది ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే చాలు.

 పండ్లపై రసాయనాలు పై పొరల్లో పేరుకుని ఉంటాయి. అందుకే మామిడి పళ్ళను తినేముందు వాటి తొక్కను తీసేయడం మంచిది. అలాగే ఉల్లిపాయల్ని కూడా పొట్టుతీశాక పై రెండు పొరలను తీసిమరీ వాడాలి. క్యాబేజికి కూడా ఇదే పద్ధతి..