KBC 16: కౌన్ బనేగా కరోడ్ పతి రూ. 50 లక్షల ప్రశ్న ఇదే.. మీరు సమాధానం చెప్పగలరా?

KBC 16: కౌన్ బనేగా కరోడ్ పతి రూ. 50 లక్షల ప్రశ్న ఇదే.. మీరు సమాధానం చెప్పగలరా?

చరిత్ర సృష్టించిన బుల్లితెర షోలలో కౌన్ బనేగా కరోడ్‌పతి(Kaun Banega Crorepati) ఒకటి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitab Bachhan) హోస్ట్ గా 2000 సంవత్సరంలో మొదలైన ప్రముఖ ఈ క్విజ్ షో.. గత 22 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.

అంతేకాదు..ఈ ప్రోగ్రాం వ్యూవర్స్ ను టీవీల ముందు కట్టిపడేస్తుందంటే ఆశ్చర్యం లేదు.. 15 ఎపిసోడ్ లు కంప్లీట్ చేసికున్న ఈ కౌన్ బనేగా కరోడ్ పతి షో..ప్రస్తుతం సీజన్ 16 ఇంట్రెస్టింగా సాగుతోంది. ఆడేవాళ్లకే కాదు.. చూసేవాళ్ల మెదడుకు కూడా పదును పెట్టే ఈ గేమ్ షోలో.. తాజాగా సోమవారం సెప్టెంబర్ 16న.. రూ.50 లక్షల విలువైన ప్రశ్న ఒకటి జార్ఖంకు చెందిన త్రిశూల్ సింగ్ చౌదరి (Trishul Singh Choudhary)  అనే  కంటెస్టెంట్ను తికమక పెట్టింది.

ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?

త్రిశూల్ తనదైన శైలిలో 13 ప్రశ్నల వరకు చాలా నమ్మకంగా, బలమైన కాన్పిడెంట్ తో ఆడుతూ ఆడియన్స్ మెదళ్లకు పనిపెట్టారు. అలాంటి క్రమంలో త్రిశూల్ కి ఎదురైనా 14వ ప్రశ్న తనని తికమక పెట్టింది. 14వ ప్రశ్న విలువ రూ.50 లక్షలు.ఇంతకీ ఆ ప్రశ్న ఏంటీ ? ఆ ప్రశ్నకు అతడు సమాధానం చెప్పాడా?  లేదా అనేది తెలుసుకుందాం. 

ప్రశ్న: గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రకారం..ఎక్కువ సార్లు ట్రాన్స్‌లేట్ చేసిన డాక్యుమెంట్ ఏది?

ఆప్షన్లుగా..

ఎ) యూఎస్ కాన్‌స్టిట్యూషన్

బి) యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్

సి) కమ్యూనిస్ట్ మానిఫెస్టో

డి) యునైటెడ్ నేషన్స్ ఛార్టర్ 

ప్రశ్న విన్న త్రిశూల్ సమాధానం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరగా ఆశలు వదులుకున్నారు. అతను గేమ్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయిం చుకున్నాడు. దీంతో గేమ్ ను అక్కడితో వదిలేయడంతో రూ.25 లక్షలు సొంతం చేసుకున్నారు. తన నిర్ణయం తర్వాత అమితాబ్ బచ్చన్ రూ.50 లక్షల ప్రశ్నకు సరైన సమాధానాన్ని వెల్లడించాడు. 

ఈ ప్రశ్నకు సరైన సమాధానం..ఆప్షన్: బి) యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (The Universal Declaration of Human Rights)

యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్:

ప్రపంచమంతా అన్ని దేశాల్లోని ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఏకంగా 577 సార్లు దీనిని ట్రాన్స్‌లేట్ చేయడం విశేషం. ఎన్నో భాషలు, యాసల్లోనూ దీనిని అనువదించారు. 1999లోనే ఈ వరల్డ్ రికార్డును యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికి 577 సార్లు అనువదించగా..ఇప్పటికీ అనవదిస్తూనే ఉన్నారు.

త్రిశూల్ ఆటకు  వీడ్కోలు పలికిన బిగ్ బి పోటీదారుడి కృషి , అంకితభావాన్ని ప్రశంసించారు. ఆయన భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.

జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన 30 ఏళ్ల త్రిశూల్ సింగ్ చౌదరితో ఈ ఎపిసోడ్ ప్రారంభమైంది. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, త్రిశూల్ ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్‌ను విజయవంతంగా క్లియర్ చేసి, హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో పాటు హాట్ సీట్‌పై తన స్థానాన్ని పొందాడు. తన కుటుంబం యొక్క నిరంతర మద్దతుతో ఇక్కడికి వచ్చానని..అలాగే తాను జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను బిగ్ బికి వివరించాడు. 

గురువారం సెప్టెంబర్ 5న జరిగిన ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. 'గిరిజన వర్గానికి చెందిన బంతి వడివా'..కోటి రూపాయల ప్రశ్నను ప్రయత్నించారు. అయితే దానికి సమాధానం చెప్పలేకపోవడంతో రూ. 50 లక్షలు మాత్రమే గెలుచుకున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే.. 

ప్రశ్న:1948లో బెంగాలీ శిల్పి చింతామోని కర్ ది స్టాగ్ అనే ఆర్ట్‌వర్క్ టైటిల్‌ని గెలుచుకున్నారు?

ఆప్షన్లుగా ఎ) పైథాగరస్ ప్రైజ్, బి) నోబెల్ ప్రైజ్, సి) ఒలింపిక్ మెడల్ డి) ఆస్కార్ అవార్డు. 

ఇది ఆప్షన్ సి)  ఒలింపిక్ పతకం.