టెట్ దరఖాస్తుకు నవంబర్ 20వ తేది ఆఖరు

ఇప్పటిదాకా 2.07 లక్షల అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది. అయితే, మంగళవారం రాత్రి వరకూ 2,07,765 అప్లికేషన్లు వచ్చాయనీ టెట్ కన్వీనర్ జి.రమేశ్ తెలిపారు. పేపర్ 1కు 61,930 మంది, పేపర్ 2కు 1,28,730 మంది, రెండు పేపర్లకు 17,104 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 20 వరకూ అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. టెట్ అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్ల ఇప్పటికే ప్రారంభం కాగా.. ఈనెల 22 వరకూ ఆ అవకాశం ఉంది. దరఖాస్తు సమయంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే 70329 01383/ 90007 56178 నంబర్లకు వర్కింగ్ డేస్ లో కాల్ చేయాలని అధికారులు సూచించారు.