టెట్‌‌‌‌‌‌‌‌కు 2.75లక్షల దరఖాస్తులు

  • ముగిసిన అప్లికేషన్ గడువు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. రెండు పేపర్లకు కలిపి మొత్తం 2,75,773 దరఖాస్తులు వచ్చాయని టెట్ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. పేపర్1కు 94,335 అప్లికేషన్లు, పేపర్ 2 కు 1,81,438 అప్లికేషన్లు వచ్చాయని  చెప్పారు.  మే నెలలో నిర్వహించిన టెట్ కు 2.86 లక్షల దరఖాస్తులు రాగా.. ఆరు నెలల వ్యవధిలోనే అదే స్థాయిలో అప్లికేషన్లు రావడం గమనార్హం. అయితే, ఎప్పటిలాగే పేపర్ 1 కంటే పేపర్ 2కు దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. అప్లికేషన్లలోని తప్పుల సవరణ గడువు శుక్రవారంతో ముగియనుంది.