- సర్వర్ ప్రాబ్లమ్‌తో రాత్రి 8 వరకు పరీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొనసాగుతున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఎగ్జామ్‌కు సర్వర్ ప్రాబ్లమ్స్ తప్పడం లేదు. శనివారం శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ షిఫ్ట్‌లో సర్వర్‌లో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో 4 గంటల ఆలస్యంగా పరీక్ష జరిగింది.
శనివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పేపర్ 2 ఎగ్జామ్ ఉంది. అయితే, వర్ధమాన్ కాలేజీలో టెట్ ఎగ్జామ్‌కు హాజరైన 750 మందిలో, 155 మందికి కంప్యూటర్లు పని చేయలేదు. దీంతో వేరే సర్వర్ ద్వారా రాత్రి 8 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.