హైదరాబాద్, వెలుగు : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఎగ్జామ్స్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి తెలిపారు. ఈ పరీక్షలను 2,75,753 మంది రాయనుండగా, వీరిలో పేపర్–1కు 94,327 మంది, పేపర్–2కు 1,81,426 మంది అటెండ్ అవుతారని వెల్లడించారు.
వీరికోసం 17 జిల్లాల పరిధిలో 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకూ ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపారు.