- ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. బుధవారం రిలీజ్ కావాల్సిన టెట్ ఫలితాలు వాయిదాపడ్డాయి. అయితే, ఎన్నికల కోడ్ కన్నా ముందే నోటిఫికేషన్ రావడంతో పాటు దాంట్లో ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్, టీచర్లకు సంబంధించినది కావడంతో ఇబ్బందులు రాకుండా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఏడు ఉమ్మడి జిల్లాల్లో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.