ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు టెండర్లు

ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు టెండర్లు
  • 11 నియోజకవర్గాల్లో పిలిచిన కార్పొరేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మరో 11  నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణాలకు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్టక్చర్  డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఈడబ్ల్యూఐడీసీ) శుక్రవారం టెండర్లు పిలిచింది. వీటిలో మంథని, ఖమ్మం, పాలేరు, కొల్లాపూర్, వికారాబాద్, షాద్ నగర్, హుస్నాబాద్, ఆంధోల్, నల్గొండ, వరంగల్ ఈస్ట్, ములుగు నియోజకవర్గాలు ఉన్నాయి. 

వచ్చే నెల 1 వరకు టెండర్ దాఖలు చేసేందుకు గడువు విధించగా, 8న ఫైనాన్షియల్ బిడ్​ను కార్పొరేషన్ అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్, మధిర, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అధికారులు టెండర్లు పిలిచారు. వీటితో మొత్తం 14 నియోజకవర్గాల్లో టెండర్లు పిలవడం పూర్తయింది.