టెక్సస్ హోటల్​లో పేలుడు..21 మందికి గాయాలు

 టెక్సస్: అమెరికా టెక్సస్​లోని హిస్టారికల్ శాండ్​మన్ సిగ్నేచర్ హోటల్​లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి క్రిటికల్​గా ఉందన్నారు. పేలుడు ధాటికి భవనం కిటికీలు, ఫర్నీచర్ కొంత దూరందాకా ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగానే పేలుడు జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇదే బిల్డింగ్​లోని ఓ ఫ్లోర్​లో రెస్టారెంట్ నిర్మాణంలో ఉందని, 245 గదులున్న ఈ హోటల్​లో పేలుడు ఎక్కడ జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.