అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం (ఆగస్టు 30) మధ్యాహ్నం టెక్సా్స్ లోని అన్నాలో యూఎస్ రూల్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన మ్గుగరు వ్యక్తులతో సహా మొత్తం నలుగురు మృతిచెందారు.
కొలిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒకేసారి ఐదు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి(27), అతని స్నేహితుడు ఫరూక్ షేక్ (30), లోకేష్ పాలచర్ల ( 28), తమిళనాడుకు చెందిన దర్శిని వాసిదేవన్ (25)గా గుర్తించారు.