చేసిన అప్పులు తీర్చలేక జగిత్యాల జిల్లాలో ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని కృష్ణ నగర్ కు చెందిన గాజుల నరహరి టెక్స్ టైల్ వ్యాపారం చేస్తున్నాడు. జగిత్యాల క్లబ్ లో అప్పుల బాధతో నరహరి ఫ్యాన్ కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. బట్టల వ్యాపారంలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్ల లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నన్ను క్షమించండి...
నేను చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నన్ను క్షమించండి.. అంటూ లెటర్ రాసి నరహరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.