
గండిపేట, వెలుగు: మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ ఆఫీసులో మంగళవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం కాసుల వర్షం కురిపించింది. ఒక్కరోజే రూ.52లక్షల69వేల216 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా టీజీ07ఆర్9999 నంబర్‌ను కాన్గ్రుయెంట్ డెవలపర్స్ కంపెనీవారు రూ.12లక్షల49వేల999కు దక్కించుకున్నారు.
టీజీ07ఏఏ0009ను రుద్రా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రూ.8.50లక్షలకు, టీజీ07ఏఏ0001ను ఫ్యూజీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.4.77లక్షలకు, టీజీ07ఏఏ0099ను మంగ్యా జ్యోతి రూ.2.81లక్షలకు, టీజీ07ఏఏ0006ను మారబోయిన మహేశ్‌కుమార్ రూ.1,99,999కు, టీజీ07ఏఏ0027ను గుర్రం మిథున్‌రెడ్డి రూ.1.32లక్షలకు దక్కించుకున్నారు.