ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వాహనాల నంబర్ ప్లేట్లపై ఫ్యాన్సీనంబర్ కోసం తెగ పోటీపడుతారు. లక్కీ నంబర్, సెంటిమెంట్, బర్త్ డే, పెళ్లి రోజు డేట్ లు .. నంబర్లో ఉండేలా చూసుకుంటారు. దీని కోసం వాహనదారులు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వేలం పాటలో దక్కించుకుంటారు.
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సెప్టెంబర్ 30న వేసిన వేలం పాటలో ఫ్యాన్సీనంబర్ TG 09 B 9999 నంబర్ ఏకంగా 20 లక్షలు పలికింది. లాట్ మోబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 20 లక్షల ఒక వెయ్యి 111 రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అలాగే TG 09 C 0001 నంబర్ కు 10 లక్షల 27 వేల 777 పలికింది. TG 09 C 0006 కు 3లక్షల 85 వేలు ఖర్చు పెట్టారు. ఇలా ఒక్కరోజే ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలో ఆర్టీఏకు రూ. 47 లక్షల 12 వేల265 రూపాయల ఆదాయం వచ్చింది.
- TG 09 C 0009కు రూ. 2,75లక్షలు
- TG 09 C 0007కు రూ. 1,77 లక్షలు
- TG 09 B 9909 కి రూ. 1,35 లక్షలు
- TG 09 C 0005కు రూ. 1,13 లక్షలు
- TG 09 C 0011కి రూ. లక్షా 4 వేల 999