
- 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టుల భర్తీ
- -ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్
- ఫైల్‌పై సంతకం చేసిన మంత్రి సీతక్క
- తెలంగాణ వచ్చాక అంగన్వాడీల్లో తొలి నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు : అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అంగన్ వాడీ, హెల్పర్ల పోస్టులను భర్తీ చేస్తున్న తొలి నోటిఫికేషన్ ఇదేనని అధికారులు చెప్తున్నారు.
రాష్ట్రంలో 35,700 అంగన్ వాడీ సెంటర్లు ఉండగా.. 149 ఐసీడీఎస్ ( ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సెంటర్స్ ) ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతలు, 7 నెలల నుంచి 3 ఏండ్లు, 3–6 ఏండ్ల మధ్య వయస్సుగల పిల్లలు కలిపి మొత్తం 21, 59, 988 మందికి బాలామృతం, ఎగ్, ఫుడ్ ను అందిస్తున్నారు. త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను లాంచ్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.