డీఎస్సీ ఫైనల్ కీ రిలీజ్​

డీఎస్సీ ఫైనల్ కీ రిలీజ్​

హైదరాబాద్,వెలుగు: టీజీ డీఎస్సీ ప‌‌‌‌రీక్షల ఫైన‌‌‌‌ల్​కీ రిలీజైంది. స్కూల్ ఎడ్యుకేష‌‌‌‌న్  అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ‘కీ’తో పాటు రెస్పాన్స్‌‌‌‌  షీట్లను కూడా అధికారులు అందుబాటులో పెట్టారు. వారం రోజుల్లో మెరిట్ లిస్టులనూ రిలీజ్ చేయనున్నారు.

 వివరాలను https://tgdsc.aptonline.in/tgdsc  వెబ్ సైట్​లో పెట్టామని స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. కాగా, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్​లైన్​లో డీఎస్సీ పరీక్షలు జరిగాయి. 26 సెషన్లలో 109 క్వశ్చన్  పేపర్లకు పరీక్షలు నిర్వహించారు.