HMDA : హెచ్ఎండీఏ చెరువులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

HMDA : హెచ్ఎండీఏ చెరువులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ  పరిధిలో చెరువులపై సమగ్ర సర్వే కు ఆదేశించింది.  గ్రేటర్ లోని చెరువుల విస్తీర్ణం, FTL, బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయించింది. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవిన్యూ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.  సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలను వెబ్ సైట్ లో పెట్టనుంది ప్రభుత్వం. 

ఇటీవలే  ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఆక్రమణలు హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.   ఈ కూల్చివేతలపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే విచారణ సందర్శంగా చెరువుల FTL  పరిధిని నిర్ధారించారా అని ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది హైకోర్ట్.   ఈ క్రమంలోనే ముందుగా ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లను గుర్తించాలని ఆదేశించింది ప్రభుత్వం.  మరి అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు ఉంటాయా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. 

మరో వైపు ఇటీవలే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో హైడ్రాకు మరిన్ని పవర్స్ వచ్చినట్టైంది.