259 మందితో హైడ్రా టీం ..ఎవరెవరంటే.?

 గ్రేటర్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు, విపత్తు  నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా( హైదరాబాద్ డిజాస్టర్, రెస్పాన్స్ అండ్ అసెట్స్)  HYDRA కు అవసరమైన ఆఫీసర్లు, సిబ్బందిని  కేటాయించింది ప్రభుత్వం.259 మంది ఆఫీసర్లు,సిబ్బందిని  కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఒక్క ఐపీఎస్, ముగ్గురు గ్రూప్ 1 స్థాయి ఎస్పీలు,5 మంది డిప్యూటీ స్థాయి  సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు,33 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు,5 మంది రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు,12 మంది రిజర్వ్ ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్,6 మంది అనలిటికల్ ఆఫీసర్లను కేటాయిస్తూ  మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. 3500 మంది అవసరమని హైడ్రా కమిషనర్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే   హైడ్రాకు ఛైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి,  కమిషనర్ గా  రంగనాథ్ ఉన్నారు.

త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్: రంగనాథ్

2,500 చదరపు కిలో మీటర్ల పరిధి ఉన్న హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ ​స్టేషన్ ఏర్పాటవుతుందని రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఈ పోలీస్ ​స్టేషన్ ద్వారానే ఎస్​వోటీ ఏర్పాటు చేసి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెడ్తామన్నారు. హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్టు ఉందని చెప్పారు. పార్క్​ స్థలాలను కాపాడే కాలనీ సంఘాలకు మద్దతిస్తామన్నారు. హైడ్రాకు మొత్తం 3,500 మంది సిబ్బంది అవసరమని, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. హైడ్రా కింద అసెట్​ ప్రొటెక్షన్​తోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో 72 టీమ్స్​ను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.