హైదరాబాద్ , వెలుగు : మెడికల్ డివైజ్ల ప్రదర్శన కోసం తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (తానా) స్టేట్ కన్వెన్షన్ హైదరాబాద్లో ఆదివారం థానకాన్సదస్సు నిర్వహించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ యన్. రవీంద్ర నాయక్ ప్రారంభించారు. తానా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి.ఎస్.రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా ఆధునిక సాంకేతిక పరికరాల ప్రదర్శన
వైద్య పరిశ్రమ నిపుణలతో సెమినార్లను నిర్వహించామని తెలిపారు. చిన్న ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ వంటి అంశాలపై ప్యానెల్ చర్చలు జరిగాయి. సుమారు 500 మంది డాక్టర్లకు ఈ సదస్సులో పాలుపంచుకున్నారు.