TG Inter Supplementary Exams:మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

TG Inter Supplementary Exams:మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను  మే 22 నుంచి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ  కృష్ణ ఆదిత్య.రి వెరిఫికేషన్, రి కౌంటింగ్ కి వారం రోజులు సమయం ఇచ్చారు. జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు  ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు.ఏప్రిల్  23 నుంచి 30 వ తేదీ వరకు అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజ్ చెల్లించేందుకు అవకాశం ఉంటుందన్నారు ఆదిత్య. 

మేడ్చల్ ఫస్ట్.. మహబూబాబాద్ లాస్ట్

ఇంటర్ ఎగ్జామ్స్ కు 9 లక్షల 97వేల మంది  విద్యార్థులు అటెండ్ అయ్యారు. 19 వాల్యుయేషన్ కేంద్రాల్లో  పేపర్స్ వాల్యూయెట్ చేశాం.  పరీక్ష కేంద్రాలు, వాల్యుయేషన్ కేంద్రాల్లో కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాం. రి కౌంటింగ్ కోసం రూ.100  ఫీజు, రి వెరిఫికేషన్ కోసం ఫీజు రూ.600 రూపాయలు  . ఇంటర్ బోర్డ్  అధికారిక వెబ్ సైట్ ద్వారా రి కౌంటింగ్, రి వెరిఫికేషన్ కో దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రైవేట్ కాలేజీల్లో 69.8% మొదటి  సంవత్సరం, 65.83% సెకండ్ ఇయర్ పాస్. ప్రభుత్వ కాలేజీల్లో మొదటి సంవత్సరం 42.49%, సెకండ్ ఇయర్ 53.44% పాస్.  మొదటి సంవత్సరం మేడ్చల్ 77.21% అత్యధిక ఉత్తీర్ణత,  అత్యల్పంగా మహబూబాబాద్ 48.43% ,సెకండ్ ఈయర్ లో ములుగు జిల్లాలో అత్యధికంగా 80.12% . అత్యల్పంగా కామారెడ్డిలో 54.93% పాస్  అయ్యారని అధికారులు వెల్లడించారు