
- టీజీ ఎండీసీ ఆధ్వర్యంలో ప్రారంభం
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: మినరల్ డెవలప్మెంట్కార్పొరేషన్(ఎండీసీ) ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్లో ఏర్పాటు చేసిన సాండ్బజార్ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు కట్టుకునేవారు ఈ సాండ్బజార్ను వినయోగించుకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ట్రక్కు సన్న ఇసుకను రూ.1,800కు, ట్రక్కు దొడ్డు ఇసుకను రూ.1,600కు ఇస్తోందని, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికే పంపుతారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనంగా ఉంటాయన్నారు.
365 రోజులు ఇసుక బజార్అందుబాటులో ఉంటుందన్నారు. ఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ ఏరావత్ మాట్లాడుతూ.. అక్రమ ఇసుక దందాను అరికట్టేందుకు ప్రభుత్వమే ధర నిర్ణయించి, సాండ్బజార్లను అందుబాటులోకి తెస్తోందన్నారు. హైదరాబాద్ లోని మూడు ప్రాంతాల్లో సాండ్ బజార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎండీసీ ఎండీ సుశీల్ కుమార్, ఏడీ మైన్స్ నర్సిరెడ్డి, బిల్డర్లు, లారీల యజమానులు పాల్గొన్నారు.