నారాయణపేట, వెలుగు: టీజీ ఎంఐడీసీ ఇంజనీర్ల బృందం నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్‌ను పరిశీలించింది. అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాంకిషన్ తో కలిసి టీజీ ఎంఐడీసీ చీఫ్ ఇంజినీర్ దేవేందర్ కుమార్, ఎస్ఈ సురేందర్ రెడ్డి, ఈఈ జైపాల్ రెడ్డి బిల్డింగ్‌ను పరిశీలించి వివిధ విభాగాల ఏర్పాటు, అవసరమైన పరికరాలు, కల్పించాల్సిన సౌలతులపై చర్చించారు.
కాలేజీ ప్రిన్సిపాల్ కాలేజీ రోడ్డు, ప్రహారీ, మార్చురీ నిర్మాణం విషయాన్ని చీఫ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువెళ్లారు.జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్, టీజీ ఎంఐడీసీ డీఈ కృష్ణమూర్తి, ఏఈ సాయి మురారి పాల్గొన్నారు.