హైదరాబాద్, వెలుగు: కేంద్రం అమలు చేస్తున్న అగ్రి, హార్టీకల్చర్ పథకాల్లో స్టేట్మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అండ్ కో-ఆపరేటివ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాసంగి నుంచే యాంత్రీకరణ పథకాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు విడుదలయ్యే నిధులను పూర్తిగా వినియోగించేందుకు వీలుగా స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేస్తుందన్నారు.
ప్రతిపైసా రాష్ట్ర రైతు సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చూడాలని కోరారు. పత్తి కొనుగోళ్లలో ఎక్కడా ఇబ్బంది లేకుండా మార్కెటింగ్ అధికారులు చర్యలు చేపట్టలని మంత్రి స్పష్టం చేశారు.