- రూ.30 కోట్ల విలువైన ఆస్తులు ఫ్రీజ్ చేసిన టీజీ న్యాబ్
హైదరాబాద్, వెలుగు: ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసుల్లో టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) నిందితుల ఆస్తులను ఫ్రీజ్ చేస్తోంది. కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే నిషేధిత అల్ప్రాజోలం తయారీ, సరఫరా కేసులో నిందితుడు ఉన్న గుడికాడి లింగ గౌడ్ (38) కు చెందిన రూ.30 కోట్లు విలువచేసే ఆస్తులను ఫ్రీజ్ చేసింది. గతేడాది మార్చిలో లింగ గౌడ్‌పై నమోదైన ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంది.
స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేటర్స్ యాక్ట్ (సఫేమా) కింద ఆస్తులను ఫ్రీజ్ చేసింది. వివరాలను టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా సోమవారం మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. సఫేమా యాక్ట్ కింద కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇండ్లు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, నగదు సహా మొత్తం రూ.30 కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేశామని తెలిపారు.