డ్రగ్స్ పై టీజీ న్యాబ్ ఉక్కుపాదం ..న్యూఇయర్ వేడుకలపై నిఘా

డ్రగ్స్ పై టీజీ న్యాబ్ ఉక్కుపాదం ..న్యూఇయర్ వేడుకలపై నిఘా
  •  20 డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు
  •  3 కమిషనరేట్ల పరిధిలో అలెర్ట్
  •  డ్రగ్స్ హాట్ స్పాట్లలో స్పెషల్ టీమ్స్
  • డార్క్ వెబ్ సైట్లైపై ప్రత్యేక ఫోకస్
  • 800 సలైవా టెస్టింగ్ కిట్స్ రెడీ

హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలపై టీజీ న్యాబ్ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 20 వేల మందితో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలకు ఏర్పాట్లు చేస్తోంది. ఐదు సంవత్సరాల కిందట నమోదైన మాదకద్రవ్యాల సరఫరా కేసులలో అరెస్టైన వారి రికార్డులను కూడా పరిశీలిస్తుంది. వీరి నుంచి డ్రగ్స్ తీసుకుని సేవించి దొరికి పోయిన వారి చిట్టా ను కూడా టీజీ న్యాబ్ జల్లెడ పడుతోంది. గతంలో డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిన 20 వేల మంది సమాచారం న్యాబ్ వద్ద ఉంది. 

వారిని నిరంతరం ఫాలో చేస్తోంది. వాళ్ల కదలికలపై ప్రధానంగా నిఘా పెట్టింది. కొత్త సంవత్సరం స్వాగత వేడుకల్లో హైదరాబాద్ లో ఈ మాదకద్రవ్యాలకు భారీ డిమాండ్ ఉంటుందనే కోణంలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, ముంబాయి తదితర రాష్ట్రాల్లోని అక్రమ డ్రగ్స్ మాఫియా వీటి సప్లై కి అనేక రహస్య మార్గాల కోసం అన్వేషిస్తున్నారని టీజీ న్యాబ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారిని వెంటాడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పూర్తి స్థాయిలో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలోని ప్రతి పబ్, బార్ అండ్  రెస్టారెంట్స్, ఫాంహౌస్, రిసార్టులతో పాటు ప్రైవేట్ హోటల్ రూమ్స్, గెస్ట్ హౌజ్ లలో కూడా సోదాలు చేయనున్నారు.  డ్రగ్స్ హాట్ స్పాట్లలో  స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కట్టడి కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు సందీప్ శాండిల్య చెప్పారు. 1,200 యూరిన్ కిట్లు సిద్ధం చేశారు. 

Also Read : పబ్బులు, బార్లతోపాటు ఓయో రూముల్లోనూ తనిఖీలు

ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు డౌట్ వస్తే అక్కడే వారి యూరిన్ టెస్ట్ చేసి అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  800 సలైవా డ్రగ్స్ టెస్ట్ కిట్లు,  20 డాగ్స్ స్క్వాడ్ టీమ్స్  స్క్వాడ్ టీంతో నిరంతరం చెకింగ్స్  చేసేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్ 31 రాత్రి  వేడుకలు ముగిసే వరకు నిరంతరం తనిఖీలు చేయనున్నట్లు టీజీ న్యాబ్  డైరక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. డార్క్ వెబ్ సైట్లపై నిఘామాదక ద్రవ్యాల సరఫరా కోసం పెడ్లర్లు ఏర్పాటు చేసుకున్న డార్క్ వెబ్  సైట్లపైనా పోలీసులు నిఘా పెట్టారు. పెడ్లర్ల కోడ్ లను ఎప్పటికప్పుడు డీకోడ్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా తేడా వస్తే వెంటనే అప్రమత్తమవుతారని సందీప్ శాండిల్య వివరించారు.