రాబోయే పదేండ్లకు యాక్షన్​ ప్లాన్ : సీఎండీ వరుణ్​ రెడ్డి

రాబోయే పదేండ్లకు యాక్షన్​ ప్లాన్ : సీఎండీ వరుణ్​ రెడ్డి
  • టీజీ ఎన్​పీడీసీఎల్​ సీఎండీ వరుణ్​ రెడ్డి

హనుమకొండ, వెలుగు: రాబోయే పది సంవత్సరాల కాలంలో విద్యుత్తు డిమాండ్​ కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇప్పటినుంచే సమాయత్తం కావాలని టీజీఎన్​పీడీసీఎల్​ సీఎండీ వరుణ్​ రెడ్డి ఆఫీసర్లకు సూచించారు. ట్రాన్స్​ కో, ఎన్​పీడీసీఎల్ పరిధిలో రాబోయే  పదేళ్ల కాలానికి చేపట్టాల్సిన భవిష్యత్తు యాక్షన్​ ప్లాన్​ పై గురువారం సాయంత్రం ఆయన రివ్యూ నిర్వహించారు.  ఈ సందర్భంగా వచ్చే పదేళ్ల కాలంలో కొత్తగా సబ్  స్టేషన్లు, కొత్త లైన్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన ప్రతిపాదనలు రెడీ చేసి, వివరణాత్మక రిపోర్ట్​ అందజేయాలన్నారు.  ట్రాన్స్ కో పరిధిలో కొత్తగా కరీంగనగర్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల పరిధిలో లోడ్ కు అనుగుణంగా  కొత్తగా 132/ 33 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఆవశ్యకత ఉందన్నారు.

 అదే విధంగా పవర్ ట్రాన్స్​ ఫార్మర్లను పెంచాలన్నారు. డిస్కం పరిధిలో లోడ్ పెరిగే అవకాశం ఉన్నచోట్లా కొత్త సబ్  స్టేషన్ల నిర్మాణం, ప్రత్యామ్నాయ విద్యుత్తు సరఫరా అందించేలా  ఇంటర్ లింకింగ్  చేపట్టాలన్నారు.  ఆసిఫాబాద్ కౌటాలలో 132/33 కేవీ సబ్  స్టేషన్ అందుబాటులోకి వస్తోందని చెప్పారు.  ప్రతి సెక్షన్​ పరిధిలో ఏఈలు వారానికోసారి తప్పనిసరిగా పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. త్వరలోనే టీజీఎన్​పీడీసీఎల్​ డాష్ బోర్డు ప్రారంభిస్తామని చెప్పారు. ఎల్సీ  యాప్ సేవలు  విస్తరించాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్​ కో డైరెక్టర్​  జగత్ రెడ్డి , ఎన్​పీడీసీఎల్​ ఇన్ చార్జ్‌  డైరెక్టర్లు బి. అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్ ,  ట్రాన్స్​కో  సీఈలు  జి.శ్రవణ్ కుమార్, విజయ్  కుమార్,  డిస్కం సీఈలు కె. తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్ , బికం  సింగ్  తదితరులు పాల్గొన్నారు.