పబ్బులు, బార్లతోపాటు ఓయో రూముల్లోనూ తనిఖీలు : న్యూఇయర్ వేడుకలపై టీజీ నాబ్ స్పెషల్ డ్రైవ్స్

పబ్బులు, బార్లతోపాటు ఓయో రూముల్లోనూ తనిఖీలు : న్యూఇయర్ వేడుకలపై టీజీ నాబ్ స్పెషల్ డ్రైవ్స్

 న్యూ ఇయర్ వేడుకలపై    తెలంగాణ న్యాబ్ స్పెషల్  డ్రైవ్ చేపట్టింది. డ్రగ్స్ ను అరికట్టేందుకు  టీజీ న్యాబ్  డైరక్టర్ సందీప్ శాండిల్య నేతృత్వంలో   డ్రగ్స్ హాట్ స్పాట్ లో  ప్రత్యేక టీంలను  ఏర్పాటు చేశారు.  తెలంగాణలోకి డ్రగ్స్ రాకుండా గోవా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో మఫ్టీలో టీమ్స్  ఏర్పాటు చేసింది.   అలాగే  టీజీ న్యాబ్  రాడార్ పరిధిలో పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టింది.  డార్క్ వెబ్ సైట్లపై సాంకేతికంగా ఫోకస్ పెట్టింది.

  న్యూ ఇయర్ వేడుకల  కట్టడి కోసం  1200 డ్రగ్స్ యూరిన్ కిట్లు, 800 సలైవా డ్రగ్స్ టెస్ట్ కిట్లు,  20 డాగ్స్ స్క్వాడ్ టీమ్స్  స్క్వాడ్ టీంతో నిరంతరం చెకింగ్స్  చేసేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్ 31 రాత్రి  వేడుకలు ముగిసే వరకు నిరంతరం తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు టీజీ న్యాబ్  డైరక్టర్ సందీప్ శాండిల్య.

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ పరిధిలో ఎక్స్సై జ్ డిపార్ట్మెంట్ తో కలిసి  ప్లాన్ చేసింది టీజీ న్యామ్ .  ట్రై కమిషనరేట్ పరిధిలోని ప్రతి పబ్, బార్ అండ్  రెస్టారెంట్స్, ఫాంహౌస్, రిసార్టులతో పాటు ప్రైవేట్ హోటల్ రూమ్స్, గెస్ట్ హౌజ్ లలో కూడా సోదాలు చేస్తామన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు టీజీ న్యాబ్  డైరక్టర్ సందీప్ శాండిల్య. 21 సంవత్సరాల లోపు వారికి ఎవరైనా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.