
- మే 19 వరకు కొనసాగనున్న ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు బుధవారం జేఎన్టీయూ వర్సిటీ అధికారులు పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 17 నుంచి మే 19 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
రూ.250 ఫైన్‌తో మే 22 వరకు, రూ.వెయ్యి ఫైన్‌తో 25 వరకు, రూ.2,500 ఫైన్‌తో 30 వరకు, రూ.5 వేల ఫైన్‌తో జూన్ 2 వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. జనరల్ విద్యార్థులకు రూ.1100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.600 ఫీజు ఉంటుందన్నారు. కాగా, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.