సమగ్ర కుటుంబ సర్వే: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి ఎన్యుమరేటర్లు

హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మధురానగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లు, అధికారులు సేకరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. 

ఆదివారం (నవంబర్ 10, 2024) జీహెచ్ఎంసీ పరిధిలో 69,624 కుటుంబాల వివరాలను అధికారులు సేకరించారు. ఒక్కో ఇంటి దగ్గర సర్వే వివరాలు సేకరించడానికి సుమారు అరగంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు. సేకరించిన డేటాను అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న కుటుంబ సర్వేను మానిటరింగ్ ఆఫీసర్స్ పరిశీలించారు. సికింద్రాబాద్ చార్మినార్ ఏరియాలో సర్వే జరుగుతున్న తీరును హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవాత్స కోట పరిశీలించారు.

ఎల్బీనగర్,  ఖైరతాబాద్ జోన్లలో ఫీల్డ్ లెవల్లో వెళ్లి సర్వే జరుగుతున్న తీరును MAUD డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక పరిశీలించారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లో సర్వే జరుగుతున్న తీరును వాటర్ బోర్డ్ ఈడీ మయాంక్ మిట్టల్ పరిశీలించారు.