
గద్వాల, వెలుగు: జిల్లాలో ఆదివారం టీజీ సెట్–2025 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గురుకులాల్లో ప్రవేశం కోసం ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్లను అధికారులు సందర్శించారు. ఎర్రవల్లి లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల స్కూల్, జూనియర్ కాలేజీ(బాలురు), ఇటిక్యాల తెలంగాణ రాష్ట్ర గురుకుల స్కూల్, జూనియర్ కాలేజీ (సీవోఈ బాలురు)లో ఏర్పాటు చేసిన ఎగ్జామ్స్ సెంటర్లను అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు తనిఖీ చేశారు.
పరీక్షా కేంద్రాల్లో నిబంధనలను తప్పకుండా పాటించాలని, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపాల్ రామాంజనేయులు, టీచర్లు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్, ధర్మాపూర్, చిన్నచింతకుంట, వేపూర్, హన్వాడ, భూత్పూర్, రాంరెడ్డిగూడెం, నంచర్ల, దేవరకద్ర, చిట్టబోయిన్పల్లి, దొడ్లోనిపల్లి, తిరుమలహిల్స్, మహబూబ్‌నగర్‌లోని గురుకులాల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం టీజీ సెట్ నిర్వహించారు.
16 సెంటర్లలో పరీక్ష నిర్వహించగా ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. సెంటర్లను అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. దుంకుడు శ్రీనివాస్, బాసిత్ పాల్గొన్నారు.