టీఎస్ స్థానంలో టీజీని తక్షణమే అమలు చేయాలి : జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా

టీఎస్ స్థానంలో టీజీని తక్షణమే అమలు చేయాలి : జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా

జగిత్యాల టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు టీఎస్‌‌ స్థానంలో టీజీని తక్షణమే అమలు చేయాలని జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు.

జిల్లాలో ఇకపై అన్ని  ప్రభుత్వ ఆఫీసులు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, వెబ్ సైట్లు, ఆన్ లైన్ వేదికల్లో తెలంగాణ కోడ్ ను వెంటనే మార్చాలన్నారు.