- తొలిరోజు 775 మంది అప్లయ్
హైదరాబాద్, వెలుగు: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం తొలి రోజు సాయంత్రం వరకు 775 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,227 మంది ఫీజు చెల్లించారని టెట్ కన్వీనర్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్1కు 305 మంది, పేపర్ 2కు 678 మంది, రెండు పేపర్లకు 244 మంది ఫీజు చెల్లించారు. అయితే, పేపర్1కు 214 మంది, పేపర్2కు 431 మంది, రెండు పేపర్లకు 130 దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గురువారం అర్ధరాత్రి డిటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేయగా.. శుక్రవారం నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.