వైశ్యులు ఐక్యంగా ఉండాలి : టీజీ వెంకటేశ్

వైశ్యులు ఐక్యంగా ఉండాలి : టీజీ వెంకటేశ్

ఎల్బీనగర్, వెలుగు: వైశ్యులందరూ  కలిసికట్టుగా ఉంటేనే రాజకీయంగా రాణించగలమని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్​అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాగోల్ లోని ఓ కన్వెన్షన్ లో మహిళా మహోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.  

మహిళల ఫ్యాషన్ షో ఆకట్టకుంది.  ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, మహాసభ అధ్యక్షుడు అమరవాడి లక్ష్మీనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద,  జనరల్ సెక్రటరీ కాచం సుష్మ, కాచం ఫౌండేషన్ అధినేత సత్యనారాయణ గుప్త, స్టేట్ ఉమెన్స్ కో-–ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్​పర్సన్ బండ్రు శోభారాణి, గాయని కౌసల్య తదితరులు పాల్గొన్నారు.